టాలీవుడ్ యంగ్ హీరో కిరణ్ అబ్బవరం బర్త్ డే ను పురస్కరించుకుని నిన్న సాయంత్రం ఆయన నటిస్తున్న కొత్త సినిమా "వినరో భాగ్యము విష్ణు కథ" నుండి మేకర్స్ పవర్ఫుల్ గ్లిమ్స్ ను విడుదల చేసారు. ఇంకా 24గంటలు కూడా గడవకముందే యూట్యూబులో ఈ గ్లిమ్స్ 2 మిలియన్ ప్లస్ వ్యూస్ తో దూసుకుపోతుంది. ట్విట్టర్ ట్రెండింగ్ హ్యాష్ ట్యాగ్స్ లో ఈ గ్లిమ్స్ నెంబర్ పొజిషన్ లో ట్రెండ్ అయ్యింది.
గీత ఆర్ట్స్ 2 బ్యానర్లో అల్లు అరవింద్ నిర్మిస్తున్న"వినరో భాగ్యము విష్ణు కథ" సినిమాలో కాశ్మీర హీరోయిన్ గా నటిస్తుండగా,మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. చేతన్ భరద్వాజ్ సంగీతం అందిస్తున్నారు. కొన్నిరోజులుగా రెగ్యులర్ షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో విష్ణు అనే తిరుపతి యువకుడిగా కిరణ్ నటిస్తున్నాడు.
![]() |
![]() |