సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ముఖ్యపాత్రలు పోషించిన "చంద్రముఖి" సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న "చంద్రముఖి 2" మూవీ ఇటీవలే అధికారికంగా ఎనౌన్స్ చేయబడింది.
తాజాగా ఈ మూవీ షూటింగ్ ఈ రోజు నుండి మైసూరు లో ప్రారంభమైంది. షూటింగ్ స్టార్ట్ చేసే ముందు లారెన్స్ తన గురువు, తలైవర్ రజినీకాంత్ ఆశీస్సులు తీసుకున్నారు. ఈ మేరకు రజిని ఇంటికెళ్లి, ఆయన కాళ్ళమీద పడి ఆశీస్సులని అందుకోవడం విశేషం. రజిని బ్లెస్సింగ్స్ అందుకుంటున్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసారు లారెన్స్. దీంతో ఈ ఫోటోలు నెట్టింట హల్చల్ చెయ్యడం స్టార్ట్ చేసాయి. పి. వాసు డైరెక్షన్లో రూపొందుతున్న ఈ సినిమాలో లారెన్స్, త్రిష లీడ్ రోల్స్ పోషిస్తున్నారు. మిగిలిన విషయాలు తెలియాల్సి ఉంది.