పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న మరో పాన్ ఇండియా చిత్రం "సలార్". "కేజీఎఫ్" తర్వాత ప్రశాంత్ నీల్ నుండి రాబోతున్న మరో ఫుల్ లెంగ్త్ యాక్షన్ ఎంటర్టైనర్ ఇది. ఇందులో శృతి హాసన్ కథానాయిక. హోంబలే ఫిలిమ్స్ బ్యానర్ పై విజయ్ కిరంగదుర్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రుర్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ పై ఒక క్రేజీ బజ్ ప్రభాస్ అభిమానులకు నిద్ర పట్టకుండా చేస్తుంది.
అదేంటంటే, త్వరలోనే అంటే వచ్చే నెల్లోనే ఈ మూవీ నుండి టీజర్ రిలీజ్ కాబోతుందట. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పనులు చాలా సైలెంట్ గా జరుగుతున్నాయట. ఈ టీజర్ కేవలం ప్రభాస్ లుక్స్, ఆయన చేసే హై ఇంటెన్స్ మాస్ యాక్షన్ ఎపిసోడ్స్ గురించే ఉంటుందట. ఇంకా అధికారికంగా ధృవీకృతం కానీ ఈ వార్తతో డార్లింగ్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. వచ్చే ఏడాది వేసవి కానుకగా ఈ మూవీ విడుదల కాబోతుంది.