విమల్ కృష్ణ డైరెక్షన్లో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన చిత్రం "డీజే టిల్లు". "గుంటూరు టాకీస్" ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం ఫిబ్రవరి 11న విడుదలై సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా పాటలకు, సిద్ధూ నటనకు ప్రేక్షకులు బ్రహ్మ రధం పట్టారు. తక్కువ బడ్జెట్టుతో తెరకెక్కించిన ఈ సినిమా అధిక వసూళ్లను రాబట్టింది. చిత్ర సీమలో అంతగా గుర్తింపు లేని సిద్ధూ ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు. విమల్ కృష్ణతో కలిసి సిద్ధూ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించారు. వీరిద్దరి ర్యాపొ బాగా సెట్ అవడంతో, సీక్వెల్ అంచనాలకు మించి విజయం సాధిస్తుందని అంతా అనుకుంటున్నారు.
లేటెస్ట్ గా వినిపిస్తున్న ఒక బజ్ ప్రకారం, డైరెక్టర్ విమల్ కృష్ణ సిద్ధుతో క్రియేటివ్ డిఫరెన్సెస్ తలెత్తడంతో ఈ ప్రాజెక్ట్ నుండి బయటకు వచ్చేసినట్టు తెలుస్తుంది. మరి ఆగస్టు నుండి మొదలయ్యే ఈ మూవీ షూటింగ్ కు దర్శకత్వ బాధ్యతలు చేపట్టేదెవరో... తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంత వరకు ఆగాల్సిందే.