ఆర్ ఆర్ ఆర్ గ్రాండ్ సక్సెస్ ను NTR 30 తో కంటిన్యూ చెయ్యాలని ఇటు తారక్, అటు అభిమానులు ఇద్దరూ కూడా చాలా బలంగా కోరుకుంటున్నారు. వీరిద్దరి కన్నా డైరెక్టర్ కొరటాల శివ ఆచార్య డిజాస్టర్ మరకను, ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ తో ఎలాగైనా పోగొట్టుకోవాలని ఇంకా చిత్తశుద్ధితో పని చేస్తున్నాడు. కానీ, ఆచార్య ఫైనాన్సియల్ సెటిల్మెంట్స్ ఇంకా క్లియర్ అవ్వకపోవడంతో కొరటాల వాటిని చక్కదిద్దే ప్రయత్నంలో బిజీగా ఉన్నాడు. వీలైనంత త్వరగా వాటిని క్లియర్ చేసుకుని తారక్ సినిమాపై ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా కాన్సన్ట్రేట్ చెయ్యాలని చూస్తుంటే, అంతకంతకు ఆచార్య వివాదాలు ఎక్కువవుతున్నాయే తప్ప తగ్గట్లేదు. దీంతో తారక్ సినిమాపై సరిగా దృష్టి పెట్టలేకపోతున్నాడు.
ఇది గమనించిన తారక్ తన 30వ సినిమా స్క్రిప్ట్ పనులు శ్రీఘ్రంగా, మంచి కంటెంట్ తో రచింపబడేటట్టు ఒక స్టార్ రైటర్ ను రికమెండ్ చేసాడంట. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న కమిట్మెంట్స్ తో పాటు ఈ సినిమాకు కూడా త్వరలోనే పని చేయబోతున్న ఆ రైటర్ ఇంకొన్ని రోజుల్లోనే ఎన్టీఆర్ 30 రైటర్స్ టీం తో జాయిన్ అవ్వబోతున్నాడట. అంతవరకు ప్రీ ప్రొడక్షన్ పనులను ఆపేయమని తారక్ చిత్రబృందానికి ఆర్డర్ వేసారట. ఈ మేరకు ఫిలిం నగర్ సర్కిల్స్ లో జోరుగా ప్రచారం జరుగుతుంది.