జూనియర్ ఎన్టీఆర్ కెరీర్‌లో బెస్ట్ మూవీస్‌లో ‘అల్లరి రాముడు’ కూడా ఒకటి. 2002 జూలై 18న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా అప్పట్లో ఘన విజయం సాధించింది.
‘ఫ్రెండ్లీ మూవీస్’ పతాకంపై బి.గోపాల్ దర్శకత్వంలో ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ చంటి అడ్డాల ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి పరుచూరి బ్రదర్స్ రచన చేయగా, ఆర్పీ పట్నాయక్ సంగీతం సమకూర్చారు. చైతన్య ప్రసాద్, పోతుల రవికిరణ్ పాటలు పలికించారు.