యంగ్ హీరోహీరోయిన్లు నిఖిల్ సిద్దార్ధ్, అనుపమ పరమేశ్వరన్ జంటగా నటించిన చిత్రం "కార్తికేయ 2". చందు మొండేటి డైరెక్షన్లో తెరకెక్కిన కార్తికేయ కు సీక్వెల్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో బాలీవుడ్ విలక్షణ నటుడు అనుపమ్ ఖేర్, ఆదిత్య మీనన్, శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష కీలకపాత్రలు పోషిస్తున్నారు. జూలై 22వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కావాల్సిన ఈ చిత్రం ఆగస్టు మొదటి వారానికి వాయిదా పడిన విషయం తెలిసిందే.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, తెలుగు మినహా అన్ని భాషలకు సంబంధించిన కార్తికేయ 2 టీజర్ ఈరోజు సాయంత్రం 5:04 గంటలకు విడుదల చెయ్యబోతున్నట్టు మేకర్స్ స్పెషల్ ఎనౌన్మెంట్ చేశారు. ఆల్రెడీ తెలుగులో కార్తికేయ 2 ట్రైలర్ విడుదలై ప్రేక్షకుల నుండి విశేష ఆదరణ చూరగొంది. మరి ఇప్పుడు అన్ని భాషలలో విడుదల కాబోతున్న టీజర్ కు ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa