టాలీవుడ్ క్రియేటివ్ దర్శకుడు రాజమౌళి, బాహుబలి ఫ్రాంచైజీ సక్సెస్ తర్వాత తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం "RRR". మార్చి 25న విడుదలైన ఈ చిత్రం క్రియేట్ చేస్తున్న రికార్డుల పర్వం ఇంకా ఆగలేదు. అత్యధిక కలెక్షన్లు సాధించిన నాల్గవ భారతీయ చిత్రంగా RRR చరిత్ర సృష్టించింది. భారతదేశంలోనే కాక, విదేశాల్లో కూడా RRR ప్రభంజనం సృష్టిస్తుంది.
ఇదిలా ఉండగా, ఈ మూవీ ఇంటర్వెల్ సీన్ కి సంబంధించిన ఒక సింపుల్ క్లిప్ ట్విట్టర్ లో పది మిలియన్ల వ్యూస్ క్రాస్ చేసి, ఇప్పటివరకు ఏ తెలుగు సినిమాకు దక్కని అరుదైన రికార్డును నమోదు చేసింది. ఆ సీన్ ఏంటని అనుకుంటున్నారా.... బ్రిటిష్ ప్యాలస్ లోకి జంతువుల వాన్ తో కలిసి తారక్ ఎంట్రీ ఇచ్చే సీన్. ఇలాంటి మాస్ యాక్షన్ సీన్ ను ఇప్పటి వరకు చూడలేదని పలువురు హాలీవుడ్ సినీలవర్స్ ట్వీట్ చెయ్యడం విశేషం.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa