పంజాబీ బ్యూటీ షెహనాజ్ గిల్ బిగ్ బాస్ సీజన్-13 తో మరింత పాపులర్ అయింది. అదే సమయంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ కు దగ్గరైంది. వీరిద్దరి మధ్య ఏదో సాగుతుందనే ప్రచారం బాలీవుడ్ లో జోరుగా జరుగుతుంది. సల్మాన్ కనిపిస్తే చాలు.. ఈ ముద్దుగుమ్మ కంట్రోల్ తప్పుతుంది. ఆయన మీద పడిపోయి ముద్దులు ఇస్తుంటుంది. దానికి ఫలితం కూడా దక్కింది. ' కభీ ఈద్ కఖీ దీపావళి' సినిమాలో ఛాన్స్ ఇచ్చాడు సల్మాన్. షెహనాజ్ నటిస్తున్న తొలి బాలీవుడ్ సినిమా ఇది. తాజాగా ఈ ముద్దుగుమ్మ ఖాతాలో మరో సినిమా పడింది. రియా కపూర్ నిర్మాణంలో అనిల్ కపూర్, భూమి పడ్నేకర్ ప్రధాన పాత్రల్లో నటించనున్న సినిమాలో గిల్ ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రానికి రియా కపూర్ భర్త కరణ్ బూలానీ దర్శకత్వం వహించనున్నారు. 2018లో రియా కపూర్ నిర్మాణంలో వచ్చిన 'వీరే ది వెడ్డింగ్' తరహా ఇది కూడా లేడీ ఓరియెంటెడ్ ఫిల్మ్ అని చెబుతున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa