నాచురల్ స్టార్ నాని ఇటీవలే 'అంటే సుందరానికి' సినిమాతో ప్రేక్షకులను పలకరించి, డీసెంట్ హిట్ అందుకున్నాడు. ఆ సినిమాలో క్యూట్ అండ్ స్వీట్ 'సుందరం'గా నటించిన నాని, తదుపరి 'దసరా' సినిమాలో ఫుల్ ఫ్లెడ్జ్డ్ మాస్ లుక్ లోకి మారిపోయాడు.
శ్రీకాంత్ ఓదెల డైరెక్షన్లో నాని నటిస్తున్న పాన్ ఇండియా చిత్రమిది. ఇందులో కీర్తిసురేష్ కధానాయిక. నాని వేషభాషలు ఈ సినిమాలో పూర్తిగా మారిపోవడంతో ప్రేక్షకులు ఈ సినిమాపై మంచి అంచనాలను పెట్టుకున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమాలో హీరోయిన్ 'పూర్ణ' లేడీ విలన్గా నటించబోతుందట. పూర్ణ ఇటీవలే బాలయ్యతో 'అఖండ' సినిమా చేసింది. ఆపై ప్రముఖ బిజినెస్ మాన్ తో నిశ్చితార్ధం చేసుకుంది. ఇప్పటివరకు పూర్ణ ఏ సినిమాలోనూ నెగిటివ్ పాత్రలో నటించలేదు. 'అవును' సినిమాలో తాను భయపడ్డట్టు నటించిన పూర్ణ ఈ సినిమాలో ప్రేక్షకులను భపెట్టడానికి రెడీ అవుతుంది. త్వరలోనే ఇందుకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa