టాలీవుడ్ టాప్ హీరోయిన్ తమన్నా భాటియా ఒకపక్క సినిమాలలో నటిస్తూనే, మరోపక్క ఓటిటిలో వెబ్ సిరీస్ లు కూడా చేస్తూ, ఫుల్ బిజీగా ఉంటుంది. తాజాగా ఆమె నటించిన బబ్లీ బౌన్సర్ మూవీ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేసుకుంది. ఈ మేరకు కొంచెంసేపటి క్రితమే తమన్నా సోషల్ మీడియా ద్వారా అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేసింది. సెప్టెంబర్ 23నుండి ప్రముఖ ఓటిటి డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో, హిందీ, తెలుగు, తమిళ భాషలలో బబ్లీ బౌన్సర్ స్ట్రీమింగ్ కానుంది.
బాలీవుడ్ డైరెక్టర్ మధుర్ భండార్కర్ డైరెక్షన్లో కమింగ్ ఆఫ్ ఏజ్ మూవీగా రూపొందిన ఈ చిత్రంలో తమన్నా ఫిమేల్ బౌన్సర్ గా కనిపించబోతుంది. స్టార్ స్టూడియోస్ మరియు జంగ్లీ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో సౌరభ్ శుక్ల, అభిషేక్ బజాజ్ కీలకపాత్రలు పోషించారు.