యంగ్ హీరో వరుణ్ సందేశ్ ఇప్పటివరకు లవర్ బాయ్ ఇమేజ్ తో సినిమాలను చేస్తూ వచ్చాడు. గతంలో వరుణ్ సందేశ్ సినిమాలంటే యువతలో మంచి క్రేజ్ ఉండేది. పోను పోనూ... కంటెంట్ పరంగా మూసధోరణి సినిమాలను చేయడంతో వరుణ్ సినిమాలకున్న క్రేజ్ తగ్గిపోయింది. దీంతో వరుణ్ కొన్నాళ్ళు సినిమాలకు దూరంగా ఉండి, ఈ మధ్యనే "ఇందువదన" సినిమాతో ప్రేక్షకులను పలకంరించాడు. సెకండ్ ఇన్నింగ్స్లో కూడా వరుణ్ పరాజయాన్నే చవి చూసాడు. దీంతో తన లవర్ బాయ్, పక్కింటబ్బాయ్ ఇమేజ్ ను పక్కన పెట్టి, తన లుక్ ను పూర్తిగా మార్చేసి, కంప్లీట్ ఛేంజ్ ఓవర్ అయ్యి వరుణ్ ఒక సినిమా చేస్తున్నాడు. అదే "యద్భావం తద్భవతి". ఈ సినిమాకు రమేష్ జక్కల డైరెక్షన్ చేస్తుండగా, ఇనయా సుల్తానా హీరోయిన్ గా నటిస్తుంది.
ఈ రోజు వరుణ్ సందేశ్ పుట్టినరోజు కావడంతో యద్భావం తద్భవతి నుండి వరుణ్ ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ లుక్ లో వరుణ్ గుర్తుపట్టని విధంగా, గడ్డం, జుట్టు బాగా పెంచేసి ఫుల్ మాస్ అవతార్ లో కనిపిస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.