బాలీవుడ్ నటి తనూశ్రీ దత్తా తనను బాలీవుడ్ మాఫియా వేధిస్తోందని ఆరోపించింది. తనను చంపేందుకు ప్రయత్నాలు చేశారని ఆరోపించింది. తాను ఎక్కడికి పారిపోనని, ఆత్మహత్య చేసుకోనని చెప్పింది. తన కెరీర్ ని ఉన్నత స్థాయికి తీసుకెళ్తానని పేర్కొంది. బాలీవుడ్ మాఫియా, మహారాష్ట్ర పాత పొలిటికల్ సర్క్యూట్, దేశ వ్యతిరేక క్రిమినల్స్ కలిసి ప్రజల్ని వేధించడానికి పనిచేస్తున్నారని తనూశ్రీ ఆరోపించింది.