ట్రెండింగ్
Epaper    English    தமிழ்

విక్రమ్ 'కోబ్రా' వాయిదా పడనుందా?

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 21, 2022, 01:03 PM

తెలుగులో విక్రమ్ కి టాలీవుడ్ హీరోలకు ఉన్నంత క్రేజ్ ఉంది. అయితే గత కొంత కాలంగా ఆయన సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడడం లేదు. ఈ క్రమంలో తనయుడు ధ్రువ్‌తో కలిసి ‘మహాన్‌’ చిత్రంలో నటించాడు. ఫిబ్రవరిలో నేరుగా అమెజాన్‌లో విడుదలైన ఈ చిత్రం మంచి వ్యూయర్‌షిప్‌ను సాధించింది. అయితే ఈ సినిమా ఓటీటీలో విడుదల కావడంతో అభిమానులు నిరాశ చెందారు. అభిమానులను మెప్పించే క్రమంలో విక్రమ్ 'కోబ్రా'తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా ప్రచార చిత్రాలు, టీజర్లు సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రాన్ని ఆగస్ట్ 11న విడుదల చేయనున్నట్టు నిర్మాతలు ఇప్పటికే ప్రకటించారు.


అయితే తాజాగా ఈ సినిమా విడుదల వాయిదా పడుతుందని సమాచారం. కోబ్రా సినిమాకు సంబంధించిన సీజీ వర్క్ ఇంకా పూర్తి కాలేదు. దాంతో సినిమాను వాయిదా వేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. స్పై యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కేజీఎఫ్ భామ శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. ఈ సినిమాకి దర్శకత్వం ఎఆర్ రెహమాన్ నిర్వహించారు మరియు సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ నిర్మించారు. లలిత్ కుమార్ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మించారు. ప్రముఖ క్రికెటర్ ఇర్ఫాన్ ఖాన్ ఈ చిత్రంలో ప్రతి ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa