టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న సినిమాలలో నందమూరి కళ్యాణ్ రామ్ నటించిన "బింబిసార" ఒకటి. ఇటీవల విడుదలైన ట్రైలర్ తో ఒక్కసారిగా ఈ సినిమాపై అంచనాలు నమోదయ్యాయి. యూట్యూబ్ లో ఈ ట్రైలర్ మిళియన్లకొద్దీ వీక్షణలతో దూసుకుపోతుంది. టైం ట్రావెల్ నేపథ్యంలో నడిచే ఈ సినిమాకు వశిష్ట్ డైరెక్టర్ కాగా ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 5వ తేదీన థియేటర్లలో విడుదల కాబోతుంది.
బింబిసార ప్రివ్యూ ను చూసిన యంగ్ టైగర్ ఎన్టీయార్ సినిమా చాలా బాగా వచ్చిందని, చిత్రబృందం మొత్తాన్ని తెగ మెచ్చుకున్నారని ఒక న్యూస్ మీడియాలో హల్చల్ చేసింది. తాజాగా ఈ మూవీని నిర్మాత దిల్ రాజు కూడా చూశారట. బింబిసార ఔట్ పుట్ తెగ నచ్చేసిన దిల్ రాజు, ఒక సాలిడ్ డీల్ ను కళ్యాణ్ రామ్ కు ఆఫర్ చేసాడట. బింబిసార తెలుగు రాష్ట్రాల డిస్ట్రిబ్యూషన్ హక్కులను కొనుక్కుని, సొంతంగా విడుదల చేస్తానని కళ్యాణ్ రామ్ ను అడిగారట. ఈ సినిమాకు సహా నిర్మాతగా వ్యవహరిస్తున్న కళ్యాణ్ రామ్, దిల్ రాజు డీల్ ను ఒప్పుకుంటే, ఈ సినిమా మరింత ఎక్కువమంది ప్రేక్షకులకు రీచ్ అయ్యే అవకాశముంది.