ఒడియా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నటి రాజేశ్వరీ రే మోహపాత్ర కన్నుమూశారు. క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమె ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతిచెందారు. ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడుతున్న ఆమెకు ఆ వ్యాధి మెదడుకు పాకింది. ఆమె 2019 ఏప్రిల్ నుంచి ఈ వ్యాధికి చికిత్స తీసుకుంటున్నారు. రాజేశ్వరి యాంకర్ గా కెరీర్ను ప్రారంభించారు. ఆ తర్వాత పలు సీరియళ్లు, సినిమాల్లో నటించి గుర్తింపు పొందారు.