ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అడవిశేష్ "గూఢచారి2" పై లేటెస్ట్ అప్డేట్

cinema |  Suryaa Desk  | Published : Thu, Jul 21, 2022, 01:47 PM

వైవిధ్యభరిత కధాకధనాలతో కూడిన సినిమాలు చెయ్యటంలో టాలీవుడ్లో ది బెస్ట్ ఎవరంటే అడివి శేష్ అని చెప్పొచ్చు. ఒక పక్క సహాయనటుడిగా చేస్తూనే మరోపక్క హీరో గా కూడా ప్రయత్నించాడు. ఈ క్రమంలో శేష్ హీరోగా చేసిన గూఢచారి, క్షణం, ఎవరు వంటి సినిమాలు కమర్షియల్ గా హిట్ అవ్వడమే కాక క్రిటిక్స్ మన్ననలను కూడా అందుకున్నాయి. అడవిశేష్ నుండి 2018లో వచ్చిన "గూఢచారి" ఎంత పెద్ద హిట్టయ్యిందో అందరికి తెలిసిందే. ఈ చిత్రానికి శశికిరణ్ తిక్కా డైరెక్షన్ చేసారు. లేటెస్ట్ గా ఈ కాంబోలో వచ్చిన "మేజర్" దేశవ్యాప్త సంచలన విజయం సాధించింది. దీంతో శశికిరణ్ - అడవి శేష్ కాంబోకు ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి.
ఈ కాంబోలో, ఈ సినిమాకు "గూఢచారి" సీక్వెల్ తెరకెక్కబోతుందని, ఈ మూవీ షూటింగ్ జరుగుతుందని అంతా అనుకుంటున్నారు. కానీ, గూఢచారి పేపర్ మీదనే ఉందని షూటింగ్ ఇంకా మొదలుకావాల్సి ఉందని ఇటీవల జరిగిన ఒక ఇంటర్వ్యూలో అడవిశేష్ తెలిపారు. ప్రస్తుతానికి తాను హిట్ సీక్వెల్ లో నటిస్తున్నాని, గూఢచారి 2 కి సంబంధించిన స్టోరీ లైన్ మాత్రమే తమ దగ్గర ఉందని, ప్రస్తుతం ఈ లైన్ కు స్క్రిప్ట్ ను సిద్ధం చేసే పనిలో శశికిరణ్ తో కలిసి బిజీగా ఉన్నామని తెలిపారు. స్క్రిప్ట్ ఫైనలైజైన తర్వాత గూఢచారి 2 గ్రాండ్ లెవెల్ లో తెరకెక్కుతోందని చెప్పారు.  






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com