కోలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇటీవలే పెళ్లి చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. జూన్ 9వ తేదీన, చిరకాల మిత్రుడు, ప్రేమికుడు డైరెక్టర్ విఘ్నేష్ శివన్ తో ఏడడుగులు నడిచిన ఈ 37ఏళ్ళ సీనియర్ హీరోయిన్ తన సినీ కెరీర్ తో పాటుగా మోస్ట్ మెమొరబుల్ వివాహాన్ని కూడా పక్కా కమర్షియల్ గా ప్లాన్ చేసుకుంది. తన పెళ్లిని ఎక్క్లూజివ్ గా ప్రసారం చేసేందుకు ప్రముఖ ఓటిటి నెట్ ఫ్లిక్స్ తో భారీ డీల్ ను కుదుర్చుకుంది.
ఐతే, నయన్ పెళ్ళికి సంబంధించిన ఫోటోలు విఘ్నేష్ శివన్ ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా బయటకు రావడంతో, తమ డీల్ ను బేఖాతరు చేసారని నెట్ ఫ్లిక్స్ సంస్థ నయన్ దంపతులను పాతిక్కోట్లు డిమాండ్ చేస్తుందని ఇటీవల జోరుగా ప్రచారం జరిగింది. ఈ వార్తలను పుకార్లే అని కొట్టి పారేస్తూ నెట్ ఫ్లిక్స్ సంస్థ, నయన్, విఘ్నేష్ తమ ఓటిటిలో అధికారిక ఎంట్రీ ఇవ్వబోతున్నారని పేర్కొంటూ, ప్రీ వెడ్డింగ్ ఫోటోషూట్ కు సంబంధించిన కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఐతే, ఎప్పుడు నయన్ వెడ్డింగ్ ను కళ్లారా చూసే భాగ్యం కలుగుతుందో మాత్రం నెట్ ఫ్లిక్స్ రివీల్ చెయ్యలేదు.