ప్రశాంత్ నీల్ డైరెక్షన్లో రాకింగ్ స్టార్ యష్ నటించిన "కేజీఎఫ్2" ఎంతటి ఘనవిజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. విడుదలైన ప్రతి చోటా రికార్డు స్థాయి వసూళ్లను రాబట్టిన ఈ చిత్రం బాహుబలి 2 తర్వాత బాలీవుడ్ లో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా, దేశంలో అత్యధిక కలెక్షన్లు సాధించిన మూడో సినిమాగా కేజీఎఫ్2 ప్రభంజనం సృష్టించింది.
లేటెస్ట్ గా కేజీఎఫ్2 థియేటర్లలో వందరోజులను దిగ్విజయంగా పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు హోంబలె సంస్థ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసింది. ప్రకాష్ రాజ్, రావు రమేష్, బాలీవుడ్ నటులు సంజయ్ దత్, రవీనా టాండన్ కీలక పాత్రలు పోషించిన ఈ చిత్రంలో శ్రీనిధి శెట్టి హీరోయిన్ గా నటించింది. రవి బస్రుర్ సంగీతం అందించారు.