మా ప్రెసిడెంట్ మంచు విష్ణు నటిస్తున్న కొత్త చిత్రం "జిన్నా". ఇషాన్ సూర్య దర్శకత్వంలో పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో విష్ణు గాలి నాగేశ్వరరావు పాత్రలో నటిస్తున్నాడు. ఇందులో విష్ణు సరసన పాయల్ రాజ్ పుత్, సన్నీ లియోన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్నారు.
AVA ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీలో ఉండబోయే ఫ్రెండ్ షిప్ సాంగ్ ను విష్ణు ట్విన్ డాటర్స్ అరియనా, వివియానా ఆలపించి, అందులో నటిoచబోతున్నట్టు ఇటీవలే అధికారిక ప్రకటన జరిగింది. తాజాగా ఈ పాట యొక్క ప్రోమో ను విడుదల చేసారు. ఇందులోని వయోలిన్ మ్యూజిక్ ఎంతో ఆహ్లాదకరంగా ఉంది. మనవరాళ్లకు మేకప్ వేసి ఆల్ ది బెస్ట్ చెప్తున్న మోహన్ బాబు, కూతుళ్లను చూసి మురిసిపోతున్న విష్ణు, ఆయన భార్య విరోనికా... ఈ ప్రోమో చూడటానికి మనసుకు హత్తుకునేలా ఉంది. ఈ ఆదివారం అంటే జూలై 24 న ఉదయం 11:13 గంటలకు పూర్తి పాట రిలీజ్ కానుంది.