మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో రంగస్థలం, ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ తో సన్నాఫ్ సత్యమూర్తి సినిమాలలో హీరోయిన్ గా నటించింది సమంత. వారిద్దరితో ఉన్న వర్క్ ఎక్స్పీరియన్స్ ను బట్టి సమంత ఇంటరెస్టింగ్ కామెంట్స్ చేసింది.
బాలీవుడ్ లో సూపర్ పాపులర్ ఐన కాఫీ విత్ కరణ్ షోలో హీరో అక్షయ్ కుమార్ తో కలిసి పాల్గొన్న సమంత, ఒక రౌండ్ లో బన్నీ, చరణ్, ధనుష్ లకు ఇంటరెస్టింగ్ టాగ్స్ ఇచ్చింది. తన అభిప్రాయం ప్రకారం, రామ్ చరణ్ నిజమైన గ్యాంగ్స్టర్ అని, బన్నీ ఒక అద్భుతమని, ధనుష్ గ్లోబల్ స్టార్ అని పేర్కొంది. అలానే, హీరో విజయ్ దేవరకొండ మోస్ట్ డిజైరబుల్ హీరో అని పేర్కొంది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్ నెట్టింట హల్చల్ చేస్తుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో పై బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ ప్రేక్షకులు కూడా విశేష ఆదరణ చూపిస్తుండడం విశేషం.