సీనియర్ కోలీవుడ్ హీరో కమల్ హాసన్, డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో తొలిసారి నటించిన చిత్రం "విక్రమ్". విజయ్ సేతుపతి, ఫాహద్ ఫాజిల్, అతిథి పాత్రలో హీరో సూర్య ఈ సినిమాలో కీలక పాత్రలను పోషించారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమల్ హాసన్ నిర్మించారు.
జూన్ 3న తెలుగు, తమిళం, హిందీ భాషలలో విడుదలైన విక్రమ్ సృష్టిస్తున్న రికార్డులు అన్ని ఇన్ని కావు. కోలీవుడ్ హిస్టరీలో అత్యధిక కలెక్షన్లు సాధించిన సినిమాగా విక్రమ్ ఆల్ టైం రికార్డును నమోదు చేసింది. తాజాగా థియేటర్లలో ఈ సినిమా యాభై రోజులను పూర్తి చేసుకున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు మేకర్స్ స్పెషల్ పోస్టర్ ను విడుదల చేసారు. RRR, KGF 2 ల తర్వాత థియేటర్లలో యాభై రోజులను పూర్తి చేసుకున్న ఈ చిత్రం కొన్ని రోజుల నుండి ప్రఖ్యాత డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో స్ట్రీమింగ్ అవుతుంది. డిస్నీ ప్లస్ హాట్ స్టార్ హిస్టరీలో ఈ సినిమాకు హయ్యెస్ట్ వీకెండ్ వ్యూయర్ షిప్ వచ్చింది.