మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, కియారా అద్వానీ జంటగా, కోలీవుడ్ డైరెక్టర్ శంకర్ డైరెక్షన్లో ఒక సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. RRR పాన్ ఇండియా గ్రాండ్ సక్సెస్ తర్వాత చెర్రీ నటిస్తున్న సోలో హీరో సినిమా ఇది. దీంతో ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి. తమన్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇప్పటికే పంజాబ్, హైదరాబాద్, వైజాగ్ లలో ముఖ్యమైన షెడ్యూల్స్ ను పూర్తి చేసుకున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్ త్వరలోనే స్టార్ట్ అవ్వనుంది.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ షెడ్యూల్ లో రామ్ చరణ్ పై హై ఇంటెన్స్ యాక్షన్ సీక్వెన్సెస్ ను తెరకెక్కించబోతున్నారట. హైదరాబాద్ లో ఈ షెడ్యూల్ జరగనుందట. శ్రీకాంత్, డైరెక్టర్ కం యాక్టర్ SJ సూర్య కీలకపాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది వేసవికి విడుదల కానుంది.