హను రాఘవపూడి డైరెక్షన్లో మలయాళ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న చిత్రం "సీతారామం". ఇందులో బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తుండగా, నేషనల్ క్రష్ రష్మిక మండన్నా కీలక పాత్రలో నటిస్తుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. ఇంకా ఈ సినిమాలో సుమంత్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, తరుణ్ భాస్కర్, భూమిక కీలకపాత్రలు పోషిస్తున్నారు.
ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 5న థియేటర్లలో విడుదల కాబోతున్న ఈ సినిమా ట్రైలర్ లాంచ్ పై లేటెస్ట్ బజ్ వినిపిస్తుంది. దాని ప్రకారం, ఈ నెల 25వ తేదీన హైదరాబాద్ లో జరగబోయే గ్రాండ్ ఈవెంట్ లో సీతారామం ట్రైలర్ విడుదల కానున్నట్టు తెలుస్తుంది. ఈ మేరకు త్వరలోనే మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చేయనున్నారట.