1998లో విడుదలైన సూపర్ డూపర్ హిట్టైన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ చిత్రం "తొలిప్రేమ". ఈ సినిమాలో పవన్ ను ఆటపట్టించే ఆకతాయి చెల్లెలిగా నటించిన వాసుకి ఆపై సినిమాలలో నటించలేదు. పవన్ క్లోజ్ ఫ్రెండ్, ప్రముఖ ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి ని పెళ్లి చేసుకుని, ప్రస్తుతం గూగుల్ లో జాబ్ చేస్తుంది.
లేటెస్ట్ గా వాసుకి సినిమాల్లోకి రీఎంట్రీ ఇవ్వబోతున్నట్టు తెలుస్తుంది. వైజయంతి మూవీస్ నిర్మాణంలో తెరకెక్కుతున్న "అన్నీ మంచి శకునములే" చిత్రంతో వాసుకి గ్రాండ్ రీఎంట్రీ ఇవ్వబోతుంది. నిన్న ఆమె పుట్టినరోజు సందర్భంగా సినిమా నుండి ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను రిలీజ్ చేసి, గ్రాండ్ వెల్కమ్ పలికారు చిత్రబృందం. ఈ సినిమాలో సంతోష్ శోభన్, మాళవికా నాయర్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్నారు. బీవీ నందినీరెడ్డి ఈ సినిమాకు దర్శకురాలు. మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది.