టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి, కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో చేస్తున్న సినిమా "వారసుడు". తెలుగు, తమిళంలలో ఏకకాలంలో షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. ఇందులో రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు.
లేటెస్ట్ బజ్ ప్రకారం, ఈ సినిమాలో విజయ్ కి పవర్ఫుల్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది. అందులో విజయ్ కాలేజ్ స్టూడెంట్ గా కనిపించనున్నాడు. ప్రెజెంట్ లో ఫుడ్ యాప్ డిజైనర్ అంటే స్విగ్గీ, జొమాటో వంటి యాప్స్ ను డిజైన్ చేసే ఇంజినీర్ లా నటించబోతున్నాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది.