అక్కినేని నాగచైతన్య, రాశిఖన్నా జంటగా నటించిన "థాంక్యూ" చిత్రం ఈరోజే థియేటర్లలో విడుదలైంది. విక్రమ్ కే కుమార్ డైరెక్షన్లో ఫీల్ గుడ్ మూవీగా రూపొందిన ఈ చిత్రం యొక్క డిజిటల్ పార్టనర్ పై లేటెస్ట్ అప్డేట్ అందుతుంది. దాని ప్రకారం, థాంక్యూ మూవీ ప్రముఖ ఓటిటీలైన అమెజాన్ ప్రైమ్ వీడియో, సన్ నెక్స్ట్ లలో డిజిటల్ స్ట్రీమింగ్ కానుంది.
అవికా గోర్, మాళవికా నాయర్, సాయి సుశాంత్ రెడ్డి కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించారు. అక్కినేని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ మూవీ ఎలాంటి రెస్పాన్స్ అందుకుంటుందో చూడాలి మరి.