మెగాస్టార్ చిరంజీవి, కోలీవుడ్ డైరెక్టర్ మోహన్ రాజా తొలిసారి కలిసి పని చేస్తున్న చిత్రం "గాడ్ ఫాదర్". సూపర్ గుడ్ ఫిలిమ్స్, కొణిదెల ప్రొడక్షన్స్ కంపెనీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో లేడీ సూపర్ స్టార్ నయనతార ఫిమేల్ లీడ్ రోల్ పోషిస్తుంది. ఇప్పటికే పలు కీలక షెడ్యూల్స్ ను ముగించుకున్న ఈ చిత్రం లో బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ కీలక అతిథి పాత్రలో నటించడం విశేషం. ఇంకా ఈ సినిమాలో బిజూ మీనన్, సత్యదేవ్, మురళీశర్మ, పూరి జగన్నాధ్, అనసూయ, గద్దర్, గంగవ్వ తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, గాడ్ ఫాదర్ క్లైమాక్స్ ప్రేక్షకులకు గూజ్ బంప్స్ కలిగించే విధంగా ఉండబోతుందట. చిరు, సల్మాన్ ల వీరోచిత పోరాటం ధియేటర్ గోడలను బద్దలు కొట్టడం ఖాయమని అంటున్నారు. ఇంకా చిరు, సల్మాన్ కలిసి ఒక మాస్ సాంగ్ లో స్టెప్పులు కూడా వెయ్యనున్నారని వినికిడి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa