ట్రెండింగ్
Epaper    English    தமிழ்

"లైగర్" మెంటల్ మాస్ ప్రీ రిలీజ్ బిజినెస్..!!షాకవుతున్న విశ్లేషకులు

cinema |  Suryaa Desk  | Published : Sat, Jul 23, 2022, 06:54 PM

డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాధ్ డైరెక్షన్లో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నటించిన చిత్రం "లైగర్". ఇందులో బాలీవుడ్ యంగ్ బ్యూటీ అనన్యా పాండే హీరోయిన్ గా నటిస్తుంది. బాక్సింగ్ నేపథ్యంలో సాగే ఈ సినిమాను ప్రఖ్యాత బాలీవుడ్ నిర్మాత కరణ్ జోహార్ తో కలిసి పూరి జగన్నాధ్, ఛార్మి సంయుక్తంగా నిర్మించారు. బాక్సింగ్ దిగ్గజం మైక్ టైసన్ ఈ సినిమాతో భారతీయ సినీ రంగ ప్రవేశం చెయ్యడం విశేషం. సీనియర్ హీరోయిన్ రమ్యకృష్ణ ఈ సినిమాలో కీలకపాత్రను పోషిస్తుంది.
ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25వ తేదీన పాన్ ఇండియా భాషల్లో విడుదల కాబోతున్న ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ పై లేటెస్ట్ న్యూస్ ఒకటి హల్చల్ చేస్తుంది. దీని ప్రకారం, లైగర్ థియేట్రికల్ రైట్స్ దాదాపు 55కోట్ల భారీ ధరకు అమ్ముడయ్యాయట. టాలీవుడ్ టైర్ 2 హీరోల్లో ఈ ఎమౌంట్ చాలా ఎక్కువ. లైగర్ ట్రైలర్ తో దుమ్మురేపిన VD ప్రీ రిలీజ్ బిజినెస్ లో కూడా టైర్ 2 హీరోలను వెనక్కి నెట్టేస్తున్నాడు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa