మెగాస్టార్ చిరంజీవి తెలుగులో సమర్పిస్తున్న బాలీవుడ్ చిత్రం "లాల్ సింగ్ చద్దా". మిస్టర్ పర్ఫెక్షనిస్ట్ ఆమీర్ ఖాన్, కరీనా కపూర్ ఖాన్ జంటగా నటించారు. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ సినిమా హాలీవుడ్ క్లాసిక్ ఫారెస్ట్ గంప్ (1994) కి అఫీషియల్ ఇండియన్ రీమేక్. ఈ చిత్రంలో ఒక కీరోల్ లో నటిస్తున్నాడు అక్కినేని వారసుడు చైతన్య.
లేటెస్ట్ గా ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ నిన్న హైదరాబాద్ లో జరిగింది. యూట్యూబులో ఈ ట్రైలర్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. విడుదలై ఒక రోజు కూడా పూర్తిగా గడవకముందే 2.3 మిలియన్ వీక్షణలతో, 18కే లైక్స్ తో దూసుకుపోతుంది. ఈ సందర్భంగా సినిమా నుండి ఫస్ట్ లిరికల్ సాంగ్ కూడా విడుదల చేసారు మేకర్స్. ఏ ఇలాగేనా ఇంకోలా కాదేంటో చిత్రం... అని సాగే ఈ పాటను ప్రీతమ్ స్వరపరచగా, భాస్కరభట్ల సాహిత్యం అందించారు. మోహన్ కణ్ణన్, సోనూ నిగమ్ ఆలపించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa