కొత్త దర్శకుడు వశిష్ట్ డైరెక్షన్లో నందమూరి కళ్యాణ్ రామ్ నటిస్తున్న పీరియాడికల్ యాక్షన్ డ్రామా "బింబిసార". ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై హరికృష్ణ కే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంతన్ భట్ సంగీతం అందిస్తుండగా, ఎం ఎం కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ చేస్తున్నారు. ఐదవ శతాబ్దం లో మగధ సామ్రాజ్యాన్ని పరిపాలించిన రాజు బింబిసార పాత్రలో కళ్యాణ్ రామ్ ఈ సినిమాలో నటిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్ చేసారు మేకర్స్. ఈ మేరకు జూలై 29వ తేదీన, హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో సాయంత్రం ఆరు గంటల నుండి ప్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ హాజరై తన అన్నకు కొండంత అండగా నిలుస్తాడని అంతా అనుకుంటున్నారు. కానీ, ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక సమాచారం లేదు. ఒకవేళ ఈ ఈవెంట్ కు ఎన్టీఆర్ రాక ఖచ్చితమైతే, ఆడియన్స్ కి ఈ సినిమా ఎక్కువగా రీచ్ అవుతుంది. ఎన్టీఆర్ అభిమానుల సపోర్ట్ ఉంటుంది. ఫలితంగా తొలిరోజు హైయెస్ట్ కలెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది. చూడాలి, మరి అన్న సినిమాకు తమ్ముడి సపోర్ట్ ఎంతవరకు ఉంటుందో...!!
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa