నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం "బింబిసార". కొత్త దర్శకుడు వశిష్ట్ తెరకెక్కించిన ఈ టైం ట్రావెల్ సినిమాలో క్యాథరిన్ తెరెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. జూలై 29వ తేదీన హైదరాబాద్, శిల్పకళావేదికలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ కార్యక్రమానికి కళ్యాణ్ రామ్ తమ్ముడు, జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరై, అన్న చిత్రానికి తగినంత ప్రొమోషన్స్ చేస్తారని అంతా అనుకుంటున్నారు. ఐతే, ఈ విషయంపై అధికారిక సమాచారం లేదు.
బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తారక్ హాజరు కావాలని ఆయన అభిమానులు బలంగా కోరుకుంటున్నారు. ఎందుకంటే, ఆర్ ఆర్ ఆర్ గ్రాండ్ పాన్ ఇండియా సక్సెస్ తర్వాత కొన్నాళ్ళు మీడియాలో హల్చల్ చేసిన తారక్, ఆపై ఒక్కసారి కూడా మీడియా కంట పడలేదు. కనీసం సోషల్ మీడియాలో పోస్టులు కూడా పెట్టట్లేదు. ఆఖరికి తన కొడుకు పుట్టినరోజు నాడైనా తారక్ దర్శన భాగ్యం ఏదో ఒక పోస్ట్ ద్వారా కలుగుతుందని ఆశించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. కొరటాల శివ మూవీ కోసం ఎన్టీఆర్ కొత్త లుక్ ను ట్రై చేస్తున్నాడని, అందుకే మీడియా కంట పడకుండా జాగ్రత్త పడుతున్నాడని తెలుస్తుంది. మరి, ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ తో అయినా ఎన్టీఆర్ సస్పెన్స్ స్పెషల్ లుక్ రివీల్ అవుతుందేమో చూద్దాం.