సురేందర్ రెడ్డి డైరెక్షన్లో స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతున్న చిత్రం "ఏజెంట్". ఇందులో అఖిల్ అక్కినేని, సాక్షి వైద్య జంటగా నటిస్తున్నారు. మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి గారు కీలక పాత్రను పోషిస్తున్నారు. ఇటీవల విడుదలైన ట్రైలర్ కు ప్రేక్షకుల నుండి విపరీత ఆదరణ దక్కుతుంది.
రీసెంట్గా జరిగిన ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ సినిమా నిర్మాత అనిల్ సుంకర ఏజెంట్ అఖిల్ పై కీలక వ్యాఖ్యలు చేసారు. ప్రతి హీరో కెరీర్ కు టర్నింగ్ పాయింట్ ఇచ్చే సినిమా ఒకటుంటుందని, అంటే ఆ సినిమాతో ఆ హీరో రేంజ్ నెక్స్ట్ లెవెల్ కెళ్తుందని, అఖిల్ కెరీర్లో ఏజెంట్ అలాంటి సినిమా అవుతుందని చెప్పారు. ఈ సినిమా కోసం అఖిల్ తన ప్రీవియస్ లవర్ బాయ్ లుక్ ను పూర్తిగా మార్చేసి, ఫుల్ రగ్డ్ లుక్ లోకి మారిపోయారని, ఒక బీస్ట్ గా బాడీని బిల్డప్ చేసాడని, ఇందుకోసం అఖిల్ ఎంతో హార్డ్ వర్క్ చేసాడని, ఈ సినిమాతో అఖిల్ రేంజ్ 10 నుండి ఒకేసారి వందకి అంటే పదిరెట్లు అఖిల్ స్టార్డం, క్రేజ్ పెరుగుతాయని చెప్పారు.
![]() |
![]() |