చిత్రసీమలో ఒక హీరో కోసం రచయిత రాసుకున్న కథ మరొక హీరో చెయ్యడం సర్వసాధారణమే. కొంతమంది హీరోలు తమ దగ్గరకొచ్చిన స్క్రిప్ట్ లను విని నచ్చక రిజెక్ట్ చేస్తుంటారు. మరికొంతమందికి ఆ స్క్రిప్ట్ లు బాగా నచ్చుతుంటాయి. వాటితో సినిమాలు చేసి సూపర్ డూపర్ హిట్లు కొట్టినవాళ్లు చాలా మందే ఉన్నారు. తాజాగా అదే లిస్ట్ లోకి చేరుతుంది "బింబిసార".
కొత్త దర్శకుడు వశిష్ట్ రాసుకున్న బింబిసార స్క్రిప్ట్ ను మొదటగా మాస్ రాజా రవితేజ కు వినిపించగా, ఆయన నుండి ఎటువంటి సమాధానం రాలేదంట. దీంతో మరొక కథను కూడా వశిష్ట్ రవితేజకు వినిపించాడట..,కానీ దానికి కూడా రవితేజ నుండి మౌనమే సమాధానమయ్యింది. దీంతో, ఇట్లా కాదనుకున్న వశిష్ట్ నందమూరి కళ్యాణ్ రామ్ ను కలిసి స్క్రిప్ట్ వినిపించాడట. కళ్యాణ్ కు స్క్రిప్ట్ బాగా నచ్చటం, ఈ ప్రాజెక్ట్ కు నిర్మాతగా వ్యహరించటం,,,అన్ని చకచకా జరిగిపోయాయన్న మాట. ఇటీవల విడుదలైన బింబిసార ట్రైలర్ ఒక్కసారిగా సినిమాపై అంచనాలను పెంచేసింది. దీంతో ఈ సినిమా విడుదల కోసం ప్రేక్షకులు కుతూహలంగా ఎదురుచూస్తున్నారు. పోతే, ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 5న విడుదల కాబోతుంది.
![]() |
![]() |