చిత్ర పరిశ్రమలో బాలనటిగా మెప్పించి, తర్వాత నేపథ్య గాయనిగా మారి 25 ఏళ్ల పాటు తనదైన శైలిలో మెప్పిస్తున్నారు సింగర్ కల్పన. తాజాగా ఓ ప్రముఖ ఛానెల్ ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత జీవితంలోని కష్టాలను గురించి తొలిసారి పెదవి విప్పారు.
2010లో వివాహబంధం నుంచి బయటకు వచ్చాక, తన కూతురితో కలిసి దిక్కుతోచని స్థితిలో పడ్డానని తెలిపారు. ఆ క్షణం చనిపోవాలని అనుకున్నానని, అప్పుడు సింగర్ చిత్ర తనను కాపాడారని చెప్పారు.