"జాతిరత్నాలు" ఫేమ్ అనుదీప్ కేవీ అందించిన కథతో ఫస్ట్ డే ఫస్ట్ షో (FDFS) అనే సినిమా ఇటీవలే పట్టాలెక్కింది. ఈ సినిమాకు డైలాగులు, స్క్రీన్ ప్లే కూడా అనుదీప్ అందించారు.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి సెకండ్ లిరికల్ సాంగ్ రిలీజ్ అయ్యింది. "నీ నవ్వే నీ చిరునవ్వే" అని సాగే ఈ పాటను రామ్ మిరియాల ఆలపించగా, రామజోగయ్య శాస్త్రి గారు సాహిత్యమందించారు. రాధన్ అందించిన మ్యూజిక్ ఫ్రెష్ గా, మెలోడియస్ గా ఉంది.
ఇటీవల రిలీజైన టీజర్ కు ప్రేక్షకుల నుండి మంచి స్పందన వచ్చింది. ఈ తరం యువత వ్యవహారశైలితో, ఫన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో శ్రీకాంత్ రెడ్డి, సంచితా బసూ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వంశీధర్ గౌడ్, లక్ష్మి నారాయణ్ కలిసి డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాకు రాధన్ సంగీతం అందిస్తున్నారు. నిన్నటితరం సక్సెస్ ఫుల్ ప్రొడక్షన్ హౌస్ పూర్ణోదయా ఫిలిమ్స్ ఈ సినిమాతో టాలీవుడ్ కి రీఎంట్రీ ఇస్తుంది.