నందమూరి కళ్యాణ్ రామ్ కొత్త చిత్రం "బింబిసార". కొత్త దర్శకుడు వశిష్ట్ తెరకెక్కించిన ఈ టైం ట్రావెల్ సినిమాలో క్యాథరిన్ తెరెసా, సంయుక్త మీనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు.
జూలై 29వ తేదీన హైదరాబాద్, శిల్పకళావేదికలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుందని నిన్ననే మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చెయ్యగా, లేటెస్ట్ గా ఆ ఈవెంట్ కు జూనియర్ ఎన్టీఆర్ ముఖ్య అతిధిగా హాజరు కాబోతున్నారని మేకర్స్ ప్రకటించారు. దీంతో కొన్నాళ్ళనుండి మీడియాకు దూరంగా ఉంటున్న తారక్ ను చూసేందుకు అభిమానులు ఈ కార్యక్రమానికి వెల్లువెత్తే అవకాశాలున్నాయి. కొరటాల శివ మూవీ కోసం ఎన్టీఆర్ ఒక సస్పెన్స్ స్పెషల్ లుక్ ను ట్రై చేస్తున్నారని, అందుకే మీడియాకు దూరంగా ఉంటున్నారని అంటున్నారు. ఇప్పుడా లుక్ రివీల్ అయ్యే టైం వచ్చిందన్న మాట.