ఇటీవల విడుదలైన 'లైగర్' మాస్ ట్రైలర్ కు ఎంతటి ఊరమాస్ రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ లో అప్పటివరకున్న ట్రైలర్ రికార్డులను లైగర్ బ్రేక్ చేసి సరికొత్త రికార్డులను క్రియేట్ చేసింది. ఒక్క తెలుగులోనే కాక తమిళం, హిందీలలో కూడా లైగర్ ట్రైలర్ కు భారీ స్పందన వచ్చింది. ముఖ్యంగా హిందీలో తెలుగు కన్నా ఎక్కువ వ్యూస్ రావడం విశేషం.
ప్రేక్షకుల నుండి ఇంతటి భారీ రెస్పాన్స్ రావడంతో లైగర్ ట్రైలర్ సక్సెస్ సెలెబ్రేషన్స్ ఒక రేంజులో జరుగుతున్నాయి. ఈ మేరకు ఒక కాస్ట్లీ బార్ రెస్టారెంట్ లో విజయ్ దేవరకొండ, ఛార్మి కౌర్ వైన్ పార్టీ చేసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోను ఛార్మి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో, ప్రస్తుతం ఆ ఫోటో నెట్టింట హల్చల్ చేస్తుంది.
పూరి జగన్నాధ్ డైరెక్షన్లో విజయ్ దేవరకొండ, అనన్యా పాండే జంటగా నటించిన ఈ చిత్రంలో రమ్య కృష్ణ, మైక్ టైసన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 25న థియేటర్లలో విడుదల కాబోతుంది.