టాలీవుడ్ యంగ్ హీరో నితిన్, కృతిశెట్టి జంటగా నటిస్తున్న కొత్త చిత్రం "మాచర్ల నియోజకవర్గం". MS రాజశేఖర్ రెడ్డి డైరెక్షన్లో పొలిటికల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ చిత్రం ఆగస్టు 12న ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతుంది.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి మాచర్ల ధమ్కీ పేరిట ఒక పవర్ఫుల్ గ్లిమ్స్ ను మేకర్స్ విడుదల చేసారు. మహాభారతంలో ధర్మాన్ని కాపాడడం కోసం లక్షలాది మంది తమ సమాధుల్ని పునాదులుగా వేశారు. మాచర్ల నియోజకవర్గంలో ధర్మాన్ని కాపాడేటందుకు నా సమాధిని పునాదిగా వేయటానికి నేను సిద్ధం అని నితిన్ చెప్పే ఇంటెన్స్ డైలాగ్ అండ్ యాక్షన్ సీక్వెన్స్ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేస్తుంది.
విడుదల తేదీ దగ్గర పడుతుండడంతో మేకర్స్ ఈ సినిమాలో కీలకపాత్రలు పోషించిన నటీనటుల ఫస్ట్ లుక్ పోస్టర్లను ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్నారు. వీటికి ప్రేక్షకుల నుండి మంచి రెస్పాన్స్ వస్తుంది. సెకండ్ లిరికల్ సాంగ్ గా రిలీజైన "రా రా రెడ్డి" ఐటెం సాంగ్ కు వస్తున్న రెస్పాన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.