బాలీవుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ భర్త మిస్సయ్యాడు. ఆమె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు కూడా చేసింది. అయితే మిస్సయింది రణ్ బీర్ కపూర్ కాదు. విజయ్ వర్మ. వీరిద్దరు భార్యాభర్తలుగా నటించిన సినిమా 'డార్లింగ్స్'. జస్మీత్ కె. రీన్ దర్శకత్వం వహించారు. షెఫాలీ షా, రోషన్ మ్యాథ్యూ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఆగస్టు 5 నుంచి నెట్ ఫిక్స్ లో స్ట్రీమింగ్ కానుంది. సోమవారం ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు మేకర్స్. టైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. అలియా నటన హైలైట్. ఇక టైలర్ రిలీజ్ ఈవెంట్ కు హాజరైన అలియా ఎల్లో కలర్ గౌన్ లో సరికొత్త లుక్ లో కనిపించింది.