కరోనా నుండి కోలుకున్న బాలయ్య, ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లోని కర్నూల్ లో ఉన్నారు. అక్కడ జరుగుతున్న NBK 107 షూట్ లో పాల్గొంటున్నారు. డైరెక్టర్ గోపిచంద్ మలినేని బాలయ్యపై కొన్ని మాస్ సీక్వెన్సెస్ ను తెరకెక్కిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ షెడ్యూల్ లొకేషన్ లో బాలయ్య ను చూడటానికి ఆయన అభిమానులు తండోపతండాలుగా, ఎక్కడెక్కడి నుండో తరలి వస్తున్నారట. తన మీద అభిమానంతో వచ్చిన వారందరికీ భోజన సదుపాయాన్ని కల్పించమని నిర్మాతలను కోరారట. అందుకు నిర్మాతలు కూడా అంగీకరించి, అక్కడకు వచ్చిన ప్రతి అభిమానికి కడుపు నిండా భోజనం పెట్టి పంపించారట. ఈ షెడ్యూల్ నుండి బాలయ్య పిక్స్ లీకై సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్న విషయం తెలిసిందే.
ఇంకా టైటిల్ ఖరారు చెయ్యని ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ కాగా, వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్ కీలక పాత్రలను పోషిస్తున్నారు. తమన్ సంగీతం అందిస్తుండగా, మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుంది.