నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటిస్తున్న కొత్త చిత్రం "బింబిసార". రచయిత- డైరెక్టర్ వశిష్ట్ తెరకెక్కించిన ఈ మూవీలో క్యాథెరిన్ థెరెసా, సంయుక్త మీనన్, వారిన హుస్సేన్, వెన్నెల కోశోర్, బ్రహ్మాజీ, శ్రీనివాస రెడ్డి తదితరులు నటిస్తున్నారు. ఈ చిత్రానికి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను ఎం.ఎం కీరవాణి అందిస్తున్నారు. హరికృష్ణ కే ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 5 వ తేదీన విడుదల కావడానికి రెడీ అవుతుంది.
లేటెస్ట్ గా ఈ మూవీ మేకర్స్ ఈ రోజు ఉదయం పదకొండు గంటల ఏడు నిమిషాలకు స్పెషల్ ఎనౌన్స్ మెంట్ చెయ్యబోతున్నారు. ఈ ప్రకటన బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ చీఫ్ గెస్ట్ గురించే అని అంతా అనుకుంటున్నారు. జూలై 29వ తేదీన హైదరాబాద్, శిల్పకళావేదికలో ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరగబోతుంది. ఈ కార్యక్రమానికి కళ్యాణ్ రామ్ తమ్ముడు, జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్ గా హాజరై, అన్న చిత్రానికి తగినంత ప్రొమోషన్స్ చేస్తారని అంతా అనుకుంటున్నారు.