పూరి జగన్నాధ్, వరుణ్ తేజ్ కాంబోలో వచ్చిన చిత్రం "లోఫర్". ఆ చిత్రం ద్వారా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ముంబై భామ దిశా పటాని. ఆపై బాలీవుడ్ బాట పట్టిన దిశా అక్కడ స్టార్ హీరోయిన్ గా ఎదిగింది. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న పాన్ వరల్డ్ మూవీ "ప్రాజెక్ట్ కే" లో దిశా కీరోల్ లో నటిస్తుంది.
బాలీవుడ్ లో ఆమ్ నటించిన ఏక్ విలన్ 2 త్వరలోనే థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ మేరకు జరుగుతున్న ప్రమోషన్స్ లో పాల్గొన్న దిశా ప్రభాస్ తో వర్క్ ఎక్స్పీరియన్స్ ను షేర్ చేసుకుంది. తను ఇప్పటివరకు పని చేసిన హీరోల్లో ప్రభాస్ చాలా నైస్ అని, చాలా హంబుల్ అని చెప్పింది. ఆయనది చాలా సింపుల్ నేచర్ అని, పెద్ద స్టార్ అన్న భావన ఉండదని చెప్పింది. ఆల్రెడీ ప్రాజెక్ట్ కే తొలి షెడ్యూల్ లో పాల్గొన్నప్పుడు దిశా ప్రభాస్ ను ఒకరేంజులో పొగిడేస్తూ, కామెంట్స్ చేసింది. తనకు ప్రభాస్ ఇంటి నుండి భోజనం తీసుకొచ్చారని చెప్తూ, ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ పెట్టింది.