కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్, 'బీస్ట్' చిత్రదర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ కలిసి ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. అదే "జైలర్". కెరీర్ పరంగా రజినీకిది 169వ సినిమా. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి. ఈ చిత్రంలో శాండల్ వుడ్ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అన్నయ్య శివరాజ్ కుమార్ కీలక పాత్రను పోషిస్తున్నారు.
లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ మూవీ షూటింగ్ కోసం రజినీకాంత్ త్వరలోనే హైదరాబాద్ రానున్నారట. హైదరాబాద్ లో నిర్మిస్తున్న భారీ సెట్స్ లో జైలర్ ఎక్కువశాతం షూటింగ్ జరుపుకోనుందట. ఇందులోనే రజినీ అండ్ టీం పై కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారట. ఇకపోతే, ఈ సినిమాకు అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం అందిస్తున్నారు. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ ఈ సినిమాను నిర్మిస్తుండగా, ఆగస్టు నెల నుండి సెట్స్ పైకి వెళ్లబోతుంది.