వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్ నిర్మిస్తున్న చిత్రం "సీతారామం". హను రాఘవపూడి డైరెక్షన్లో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మండన్నా ఇంపార్టెంట్ రోల్ లో నటిస్తుంది. ఆగస్టు 5న తెలుగు, తమిళం, మలయాళ భాషలలో గ్రాండ్ గా రిలీజ్ కాబోతున్న ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెలాఖరులో జరుగుతుందని అంటున్నారు. ఈ ఈవెంట్ కు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ ముఖ్య అతిధిగా హాజరవుతాడని ఫిలిం నగర్ సర్కిల్స్ లో ప్రచారం జరుగుతుంది. ప్రభాస్ నటిస్తున్న ప్రాజెక్ట్ కే చిత్రాన్ని వైజయంతి మూవీస్ బ్యానర్ పై ch. అశ్వినీదత్ నిర్మిస్తున్నారు. సో, సీతారామం ఈవెంట్ కు ప్రభాస్ వచ్చే ఛాన్స్ ఉంది. దీంతో ప్రభాస్ అభిమానులు సీతారామం ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఈ విషయంపై అధికారిక క్లారిటీ రావలసి ఉంది.