విమల్ కృష్ణ డైరెక్షన్లో సితార ఎంటర్టైన్మెంట్స్ నిర్మించిన చిత్రం "డీజే టిల్లు". "గుంటూరు టాకీస్" ఫేమ్ సిద్ధు జొన్నలగడ్డ, నేహా శెట్టి హీరోహీరోయిన్లుగా నటించిన ఈ చిత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. చిత్ర సీమలో అంతగా గుర్తింపు లేని సిద్ధూ ఈ సినిమాతో ఒక్కసారిగా స్టార్ ఇమేజ్ను సొంతం చేసుకున్నాడు.
విమల్ కృష్ణతో కలిసి సిద్ధూ ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే అందించారు. సీక్వెల్ కు కూడా వీరిద్దరూ కలిసే పని చేస్తారనుకుంటే, క్రియేటివ్ డిఫరెన్సెస్ తో విమల్ ఈ ప్రాజెక్ట్ నుండి బయటకొచ్చేసాడని ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. మరి ఆగస్టు నుండి మొదలయ్యే ఈ మూవీ షూటింగ్ కు దర్శకత్వ బాధ్యతలు చేపట్టేదెవరో అని అంతా కుతూహలంగా ఎదురు చూస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీకి "అద్భుతం" డైరెక్టర్ మల్లిక్ రామ్ దర్శకత్వ బాధ్యతలు చేపట్ట బోతున్నారని టాక్. ఈ మేరకు డీజే టీం తో కలిసి మల్లిక్ ప్రీ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నారట. మరి ఈ విషయంలో అధికారిక క్లారిటీ రావలసి ఉంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa