CS గంటా దర్శకత్వంలో యంగ్ హీరోహీరోయిన్లు విక్రమ్, అమృత చౌదరి జంటగా నటించిన చిత్రం "ది రాక్ స్టార్". వర్ధని నూతలపాటి సమర్పణలో స్టూడియో 87 ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి శ్రీనివాస్ నూతలపాటి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు.
లేటెస్ట్ గా ఈ మూవీ నుండి లవ్ షేడ్ పేరిట ఒక రొమాంటిక్ గ్లిమ్స్ ను విడుదల చేసారు. అద్భుతమైన విజువల్స్ , హీరోహీరోయిన్ల మధ్య కెమిస్ట్రీ, దానికి తగిన నేపథ్య సంగీతం ఆకట్టుకునే విధంగా ఉంది. షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలను జరుపుకుంటుంది. త్వరలోనే విడుదల తేదీని ప్రకటిస్తామని మేకర్స్ ఎనౌన్స్ చేసారు.