కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తొలిసారి తెలుగులో నటిస్తున్న చిత్రం "సార్"(తమిళంలో "వాతి"). లేటెస్ట్ గా ఈ సినిమా ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఒక చీకటి లైబ్రరీలో టేబుల్ లాంప్ వెలుగులో చదువుకోవడంలో పూర్తిగా నిమగ్నమైన ధనుష్ మనకు కనిపిస్తాడు. చుట్టూరా వందల కొద్దీ పుస్తకాలు వాటి మధ్యలో ధనుష్ పుస్తకాల పురుగులా కనిపిస్తున్నాడు.
తొలిప్రేమ, మిస్టర్ మజ్ను వంటి డిఫరెంట్ లవ్ స్టోరీలను తెరకెక్కించిన వెంకీ అట్లూరి ఈ సినిమాకు దర్శకుడు. ఇందులో సంయుక్త మీనన్ హీరోయిన్ కాగా, GV ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. తెలుగుతో పాటు ఒకేసారి తమిళంలో కూడా తెరకెక్కుతున్న ఈ సినిమాలో పవర్ఫుల్ విలన్ పాత్రలో డైలాగ్ కింగ్ సాయికుమార్ నటిస్తున్నారు.
ఇకపోతే, ఈ నెల 28వ తేదీన అంటే రేపు సాయంత్రం ఆరు గంటలకు టీజర్ రిలీజ్ కాబోతుంది. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ మూవీని సితార ఎంటెర్టైన్మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.