ఒకప్పుడు టాలీవుడ్ ఏలిన హీరోయిన్ ఇలియానా. వరుసగా స్టార్ హీరోలతో రొమాన్స్ చేసింది. బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంది. తెలుగులో తొలిసారి కోటి రూపాయల పారి తోషికం అందుకున్న హీరోయిన్ గా రికార్డు సృష్టించింది. ఇక్కడ ఫుల్ స్వింగ్ లో ఉండగానే బాలీవుడ్ కి చెక్కేసింది. అక్కడ కొన్ని ఆఫర్లు అందుకున్నా.. స్టార్ హీరోయిన్ రేంజ్ కి చేరుకోలేకపోయింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా బాయ్ ఫ్రెండ్ ఆండ్రూ నీబోన్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలింది. ఈ క్రమంలో ఈ ముద్దుగుమ్మ కొలతలు మారాయి. సన్నజాజిలా ఉండే ఈ బ్యూటీ బాగా బరువు పెరిగింది. దీంతో షేప్ అవుట్ అయింది. అయితే ఇటీవల ఫిజిక్ పై ఫోకస్ పెట్టిన ఇల్లీ.. మళ్లీ మునుపటి అవుట్ ఫిట్ ను అందుకుంది. ఈ ఆనందంలో ఒకట్రెండు ఫోటోలు అభిమానుల కోసం షేర్ చేసింది. ఈ ముద్దుగుమ్మ మళ్లీ ప్రేమలో పడినట్లు సమాచారం. కత్రినా సోద రుడుతో లవ్వాటలో ఉందట.