వేదిక ఏదైనా తన మార్క్ చాటుకుంటోంది దిశా పటానీ. జాన్ అబ్రహం, అర్జున్ కపూర్, దిశా పటానీ, తారా సుతారియా ప్రధాన పాత్రల్లో నటించిన సినిమా 'ఏక్ విలన్ రిటర్న్స్'. ఈ చిత్రానికి మోహిత్ సూరి దర్శకత్వం వహించారు. ఈ యాక్షన్ థ్రిల్లర్ మ టీ-సిరీస్, బాలాజీ మోషన్ పిక్చర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఈ నెల జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. విలన్ పోరీలు దిశా పటానీ, తారా సుతారియా ప్రస్తుతం ప్రమోషన్ లో బిజీగా ఉన్నారు. సోమవారం రాత్రి ముంబైలో జరిగిన ఈవెంట్ కు మస్త్ గా ముస్తాబై వచ్చింది పటానీ. గ్రీన్ కలర్ జాకెట్ లో ఎద అందాలను ఆరబోసింది. దానికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్ గా మారాయి.